జనసేన ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ పై హైదరాబాద్ లోని మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసు నమోదయింది. ఈ నెల 16న కారుతో యువతిని సంజూష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్ కారు నడిపినట్లు నిర్ధారించారు. ఈ మేరకు సంజూష్ పై పోలీసులు BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.