వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం దావా వేసింది. పాల సేకరణ చేయకుండా తితిదేకు నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సజ్జల ఆరోపించారు. వాస్తవాలు కప్పిపుచ్చి తప్పుడు ఆరోపణలు చేశారని సంగం డెయిరీ పేర్కొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆవుపాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. సాక్షి టీవీతో పాటు పలు సోషల్ మీడియా అకౌంట్స్ పై దావా చేసింది.