జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికుల ఆత్మగౌరవం నిలబెట్టేలా ముందుకెళ్తామంటే.. సార్వత్రిక ఎన్నికల మాదిరిగా కాకుండా స్థానిక ఎన్నికల్లో
ఎక్కువ చోట్ల పోటీ చేసేలా జనసైనికులకు పవన్ కళ్యా్ణ్ అవకాశాలు కల్పిస్తారా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన జనసైనికుల ఆత్మగౌరవం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి