పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక హోటల్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9మంది మంటల్లో కాలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కి చేరుకొని మంటలార్పారు. అయితే ఇప్పటి వరకు 9మంది మృతి చెందినట్లుగా అందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తేల్చారు.ఏదో గదిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగసపడ్డట్లుగా తెలుస్తోంది. పొగ కారణంగా వారు తేరుకోలేకపోయారు. కొందరు తప్పించుకోగలిగినప్పటికీ, చాలా మంది లోపలే చిక్కుకుపోయారు.