మధ్యప్రదేశ్ భిండీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీమ్కా గ్రామం శివారులో భిండ్-గ్వాలియర్ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 32 గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రోడ్డుపైకి వచ్చిన పశువులను తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతి చెందిన కూలీలు ఉత్తర ప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు.