రాష్ట్ర వ్యాప్తంగా 80 వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పంద్రాగస్టు సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క జెండా ఎగరేశారు. అనంతరం వైద్య సేవలనుద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని భట్టివిక్రమార్క తెలిపారు. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని అన్నారు. జిల్లా ఆస్పత్రులను వైద్య కేంద్రాలుగా మారుస్తున్నామని, డయాలసిస్ కేంద్రాలను మరిన్ని పెంచి మెరుగైన సేవలు అందిస్తున్నామని భట్టి తెలియజేశారు.