ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగించే సమయంలోనే తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేయడం జరిగిందన్నారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.ఏ పార్టీ అధికారంలో ఉన్న దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారండం లేదని మండిపడ్డారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని తన సొంత గ్రామమైన సంతుక్ పింప్రీ నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం భారీ ప్రచారం బ్యానర్లకు ఖర్చు చేసే డబ్బును ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తే బాగుంటుందని తెలియజేశారు.