మాస్ హీరో Jr NTR అభిమానులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎన్టీఆర్ మీల్’ (NTR Meal) సేవా కార్యక్రమం ముగిసింది. నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమాన్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 150కి పైగా కేంద్రాల్లో ‘ఎన్టీఆర్ మీల్ కిట్స్’ ద్వారా నిర్వాహకులు ఆహార పంపిణీ చేశారు. గతంలో అందించిన ‘ఎన్టీఆర్ మీల్ కిట్ల’ను వీలైనంత త్వరగా క్రింది చిరునామాకు కొరియర్ లేదా స్వయంగా అందించాలని కోరారు.