దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. షోపియాన్లో లష్కర్-ఎ-తైబా కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ వారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భారత దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబిద్ రంజాన్ షేక్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.