సిరియా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దేశంలో 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించిన కేసులో దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహెర్ అసద్‌కు మరణ శిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే కేసులో ఇద్దరి గైర్హాజరీలో ఈ శిక్ష విధించింది. 2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అసద్, ఆయన సోదరుడు మహెర్ రష్యాకు పారిపోయారు.