శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆటగాళ్ల వరుస గాయాల వెనుక IPL ఒత్తిడి ప్రధానంగా ఉందని సీఓఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘ఏఎన్ఐ’ వెల్లడించింది. ఫ్రాంచైజీల నుంచి వచ్చే ఒత్తిడి, ఆర్థిక ప్రయోజనాల కోసం కొందరు ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ లేకపోయినా, గాయాలను దాచి ఐపీఎల్ మ్యాచ్లలో ఆడుతున్నారని సీఓఈ అధికారి ఒకరు తెలిపినట్లు పేర్కొంది.