<అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారు జామున పొగురూరు బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయాపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.