కృష్ణా జిల్లా విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు చేత బలవంతంగా రాజీనామా చేయించడం వెనుక నారా లోకేష్ ధనదాహం, అధికార మదం స్పష్టంగా కనిపిస్తోందని లోకేష్ ఆదేశాలతో మంత్రులు రంగంలోకి దిగి, ఆంజనేయులుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను జైలుకు పంపుతామని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. బెదిరింపుల కారణంగా ఆంజనేయులు గుండెపోటుకు గురై ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగా, మంత్రులు నేరుగా ఆసుపత్రికే వెళ్లి బెదిరించి రాజీనామా లేఖపై సంతకం చేయించుకోవడం దారుణమని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.