మహారాష్ట్రలోని ముంబై థానెలోని ఒక స్కూల్ క్లాస్‌రూమ్‌లో స్కూల్ యూనిఫామ్ ధరించిన ఒక విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ప్రస్తుతం దుమారం రాజుకుంది. ఈ వీడియో ఇటీవల జరిగిందా..?..లేదా ఎప్పుడు తీశారన్నదిమాత్రం క్లారిటీలేదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వీడియోలో కనిపించిన విద్యార్థి ఎవరు..?..ఆ పాఠశాల ఎక్కడుందని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.