మెటా కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇన్స్టా ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ని వ్యాప్తి చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మెటా సహా దేశంలోని 8 రాష్ట్రాల పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)లకు నోటీసులు జారీ చేసింది. ఈ కంటెంట్ లో పోక్సో ఉల్లంఘనల కిందకు వచ్చే అంశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అటువంటి ప్రకటనలను గుర్తించి, తొలగించడానికి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.