తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. కావేరి జల వివాదం నేపథ్యంలో.. తమిళనాడు ప్రయోజనాల కోసం వ్యక్తిగత అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు. కావేరి అంశంలో రాజకీయం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. మేకదాతు డ్యామ్ అంశంలో రాష్ట్రం తమ హక్కులను ఎప్పటికీ వదులుకోదన్నారు.
తమిళనాడు జలహక్కుల కోసం కావేరి అంశంలో కర్నాటక సర్కారుతో చర్చలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం విజయ్ అన్నారు.