దేశం గర్వించే కళ..చేనేత కళ అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. మన రాష్ట్రం ఇలాంటి కళలకు నిలయం అని అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మన చేనేత కార్మికులది అని చీరాల కర్చిఫ్ల్ లు ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి చేసేవారని, ఒకప్పుడు చీరాలను మినీ ముంబాయి అనేవారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారని, 45 ఏళ్లుగా బిసిలు టిడిపికి వెన్నెముకగా ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు.