బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడే నేతన్న సేవలో అనే నూతన పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ. 25,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71, 536 చేనేత కుటుంబాల ఖాతాల్లోకి మొత్తం రూ. 179 కోట్లను నేరుగా జమ చేశారు.