పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని బీటెక్ విద్యార్థి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గుంటూరులోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న బాల సైదులు అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.కొంతకాలంగా యువతిపై సైదులు అనుమానం పెంచుకున్నాడని, శుక్రవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పి.. చిలకలూరిపేటకు చెందిన యువతిని కారంపూడి మండలం చింతపల్లి వద్ద కుడికాల్వకట్ట వద్దకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. యవతిని హత్య చేసినట్టు తెలుస్తోంది.