భారత సంతతికి చెందిన గొల్లపూడి సాధన అనే యువతిపై SMలో ఓ యూజర్ దుష్ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చి.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పదేళ్లకు పైగా హ్యూస్టన్లోనే ఉంటోందని సదరు యూజర్ ఆరోపించారు. వీటిని హ్యూస్టన్లోని అమెరికా అటార్నీ తోసిపుచ్చారు. ఆమెపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె అమెరికా పౌరురాలేనని స్పష్టం చేశారు. సాధన పై వచ్చిన ఆరోపణలపై ఇండియన్ అమెరికన్ అడ్వకసి కౌన్సిల్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.