యూపీఐ ఛార్జీలపై వ్యాప్తి చెందుతున్న అబద్ధాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఎండీఆర్ ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమేనని, వినియోగదారులకు రూపాయి కూడా భారం పడదని స్పష్టం చేశారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక NPCI తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. సభను సజావుగా సాగనివ్వకుండా విపక్షాలు పార్లమెంట్లో అనవసర రచ్చ చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.