ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ IIMUN నిర్వహించిన కార్యక్రమంలో జెన్ జీ నిరసన వ్యక్తం చేస్తే వారిని దేశద్రోహులుగా చూడకూడదని మోహన్ భగవత్ అన్నారు. వారు కూడా సమాజంలో భాగమేనని, వారితో సంభాషణ ద్వారా వారి ఆలోచనలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఒక తరం మీద నమ్మకం ఉంచాలంటే తాను జెన్ జీని ఎంచుకుంటానని, నేటి యువత గత తరాల కంటే ఎక్కువ నిజాయితీ కలిగి ఉందని పేర్కొన్నారు. సామాజిక వివక్ష కొనసాగినంతకాలం రిజర్వేషన్లు కూడా కొనసాగాల్సిందేనని ఆయన అన్నారు.