ఏవియేషన్ ఇంధనంలో ఇథనాల్ కలపడంపై రామ్మోహన్ నాయుడు స్పష్టత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ను కలిపే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమాన ఇంధనంలో కేంద్రం ఇథనాల్ను కలపాలని చూస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్
చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యమైనవని ఖండించారు. ప్రయాణికుల భద్రతకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

