న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ అవుతోంది. డేట్ కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ ఇవాళ అధికార ముద్ర పడింది. 112 సెకండ్ల టీజర్ లో జడల్ జమానా ఎలా ఉండబోతోందో సాంపిల్ చూపించారు. ముందు నుంచి నెలకొన్న అంచనాలకు తగ్గట్టే అవుట్ అండ్ అవుట్ వయొలెన్స్ తో నిండిపోయిన ప్యారడైజ్ విజువల్స్ రక్తంలో మునిగి తేలాయి.