ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపిన ఒక జవాన్ ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో జవాన్‌కు కూడా గాయాలయ్యాయి. ఉదయం ఏడు గంటలకు అసోంలోని, నాగోన్ జిల్లా సీఆర్పీఎఫ్ 34 బెటాలియన్ పరిధిలో జరిగింది. నిందితుడిని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (జీడీ) బల్లాని ప్రేమాంబరంగా గుర్తించారు. ప్రేమాంబరం ఉన్నట్లుండి తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ విష్ణు ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ రమ్నావాల్ సింగ్ యాదవ్‌పై కాల్పులు జరపడంతో వారు ఇద్దరూ మరణించారు.