దేశవ్యాప్తంగా E20 petrol అమ్మకాలపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఇథనాల్ ఫ్రీ పెట్రోల్‌తో పాటు ఈ20 పెట్రోల్ ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారుడికి ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు. ఈ20 పెట్రోల్‌కు తగినట్లు డిజైన్ లేని వాహనాల్లో దాన్ని వాడడం వల్ల సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.