రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. “ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం చెబుతున్నా.. ఇదొక చారిత్రక అంశం. ఇప్పటి వరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనం. ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో అన్నదానికి భోగాపురం ఉదాహరణ.