ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా SIR ప్రక్రియ సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో ఏకంగా 44.89 లక్షల ఓటర్లు అంటే సుమారు 10.8 శాతం ఓటర్ల పేర్లను అధికారులు ముసాయిదా జాబితాలో అన్ కలెక్టబుల్ కేటగిరీ కింద తొలగించేందుకు సిద్ధం చేశారు. జులై 31న విడుదలైన ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.71 కోట్లకు పడిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి రేపుతోంది.