ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతోందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. భారత్ ఆర్థికరంగానికి ఇదే అతిపెద్ద సవాలని అన్నారు. ఏఐతో సాఫ్ట్వేర్ను మరింత వేగంగా ఉత్పత్తి చేస్తున్నాము. కానీ అసలు గ్లోబల్ మార్కెట్లో ఈ అదనపు సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అవసరం ఉందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది’ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న యువ జనాభాకు ఏ రంగంలో ఉపాధి దొరుకుతుందన్నది ప్రస్తుతం కొంత అస్పష్టంగా ఉందని చెప్పారు.