మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని హైకోర్టు ఆదేశించింది. పెళ్లి, మతాన్ని స్వీకరించడం, నివాసం, భవిష్యత్ వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. దివ్యా భాటియా, అన్షు భాటియా అనే ఇద్దరు అక్కచెళ్లెల్లు.. ఇద్దరు ముస్లిం యువకులను ప్రేమించారు. వారి తండ్రి, ఆ ఇద్దరినీ తన ఇంట్లో బంధించారు.ఆ ఇద్దరినీ స్వేచ్ఛగా వదిలిపెట్టాలని కోర్టు తండ్రికి సూచించింది.