నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ నిమ్స్‌దాయ్ పుర్జా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధి కారాకోరం రేంజ్‌లోని, బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం కారణంగా మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నిర్మల్ పుర్జాతోపాటు మొత్తం 10 మంది సభ్యులున్న ఈ బృందానికి పుర్జానే నాయకత్వం వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం పర్వతంపై హిమపాతం సంభవించింది. మంచు పర్వతం కూలిపోవడం, మంచు కూరుకుపోవడం వల్ల వీళ్లు అందులో చిక్కుకుపోయారు. అలాగే, మిగతా వారిలో కూడా మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.