గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సింగ్ స్టార్ జదుమణి సింగ్ మరోసారి తన టాలెంటును నిరూపించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 55 కేజీల విభాగం ఫైనల్ పోరులో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్‌తో తలపడిన జదుమణి, తొలి రౌండ్‌ను 3-2తో కైవసం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత జరిగిన రెండవ రౌండ్‌లో వెనుకబడి, చివరికి 0-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో జై డిక్సన్ స్వర్ణం గెలవగా, జదుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు.