రణబీర్ రామాయణ మూవీ ట్రైలర్ లో సీత పాత్రలో సాయిపల్లవితో పాటు మరో నటి కూడా ఫుల్ వైరల్ అయింది. ట్రైలర్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుందని, సాయిపల్లవినే డామినేట్ చేసిందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ యువ నటి పేరు సురభి దాస్. ‘రామాయణం’ ట్రైలర్ లో కనిపించిన కొద్ది సెకన్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో సురభి దాస్ కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.