ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నమోదైన రోజు (జులై 18న బాధితురాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గొంతు నులిమినట్లు మెడపై గాయాలు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. బాధితురాలి చెంప భాగంలో కమిలిన గాయాలను వైద్యులు గుర్తించారు. ఎడమ కాలిపైనా గాయం ఉంది. తాజాగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, బుధవారం ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హాజరుపరచనున్నారు.