భారత యువ స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో ఈజిప్ట్కు చెందిన రుఖయ్యా సలేమ్ను ఓడించిన అనహత్ సింగ్.. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అద్భుత ప్రదర్శనతో భారత స్క్వాష్ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.