యువత కోసం సీఎం రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఇచ్చారు. జై జవాన్.. జై కిసాన్ కు తోడుగా ఇప్పుడు ‘జై యువ’ నినాదాన్ని అందుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాసనమండలికి, రాజ్యసభకు పోటీ చేసే వయసును 25 సంవత్సరాలుగా మార్చాలన్నారు. ఇందుకోసం పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.