స్పెయిన్ ను తొలిసారి జెన్ జీ యువరాణి పాలించబోతున్నారు. అదీ 20 ఏళ్లకే. ఆమె…
లియోనోర్. రాజు ఆరో ఫిలిప్, రాణి లెటిజియాల
కూతురు. రెండో ఇసాబెల్లా తరువాత స్పెయిన్ ను పాలించే మొదటి రాణిగా ఈమె
చరిత్రకెక్కనున్నారు. స్పానిష్ చట్టం ప్రకారం కాబోయే రాజు లేదా రాణి త్రివిధ దళాల్లో శిక్షణ పొందాలి. లియోనోర్ మూడేళ్ల శిక్షణను పూర్తిచేసి అన్ని విద్యల్లో ఆరితేరి స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్ గా నిలవనున్నారు.