తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో రసాబాస చోటుచేసుకుంది. సమావేశం కొనసాగుతుండగా కోదండరాం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లతో మహిళా ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తోందని మహిళా ఉద్యమకారులు ఆరోపించారు. మహిళా ఉద్యమకారులను అద్దంకి దయాకర్ వారించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.