కేరళ లోప్రముఖ పర్యాటక కేంద్రమైన వాగమన్‌లో ఒక ప్రైవేట్ వ్యక్తి అక్రమంగా ఆక్రమించిన 10 ఎకరాల రెవెన్యూ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇదే ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా 1.5 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే, ఆయన ఆస్తికి ఆనుకుని ఉన్న 40 సెంట్లు భూమికి పట్టా లేదని తహసీల్దార్ స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఆయన సమక్షంలోనే ఈ భూమిని కొలిచి, సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.