మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వచ్చిన ఒక ట్రక్కు, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఇథనాల్ లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న కారును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.