భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు వెళ్లే యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాత్ర నిర్వహణ కమిటీ వెల్లడించింది.