గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులకు తెలంగాణ టీ20 మంచి అవకాశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ 20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచిన విషయం తెలిసిందే. జట్టు ఆటగాళ్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీనే తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే క్రీడాకారులకు భారీగా నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్పీ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు వివరించారు.