రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియను మరో పది రోజులు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్‌వోలకు అందించే గడువును ఆగస్టు 3 వరకు పెంచింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ గడువు జులై 24 వరకు మాత్రమే ఉంది.ఆగస్టు 3న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. ముసాయిదా జాబితాను ఆగస్టు 10న ప్రకటిస్తారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, చిరునామా మార్పుల కోసం ఫారం-6, ఫారం-8లు ఆగస్టు 10 తర్వాత సమర్పించాల్సి ఉంటుంది.

