ఒక వర్గానికి శేఖర్ మాస్టర్, మరో వర్గానికి జానీ మాస్టర్ నాయకత్వం వహిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. తాజాగా డ్యాన్సర్ శ్రష్టి వర్మ సంచలన ఆరోపణలు చేసింది. అసోసియేషన్ సమావేశంలో జానీ మాస్టర్ అసిస్టెంట్లు కొందరి పై దాడి చేశారని ఆమె అన్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. ఎలాంటి అవినీతికి పాల్పడని ఈసీ మెంబర్లను టార్గెట్ చేయడం సరికాదని జానీ మాస్టర్‌పై కేసు పెట్టాననే ఒకే ఒక్క కారణంతో, ఆయన టీమ్ తనపై కక్ష గట్టారని శ్రష్టి వర్మ చెప్పుకొచ్చింది.