పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే దర్శించుకున్న భక్తుల సంఖ్య 2.75 లక్షలు దాటి మూడు లక్షలకు చేరువైంది.యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది.ఈ క్రమంలో ఇవాళ అమర్నాథ్ను దర్శించుకున్న భక్తుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉంది. సోమవారం ఒక్కరోజే 24,259 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.