తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికల నిర్వహణ, కొత్త సభ్యత్వాల జారీ అంశాలపై ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ల మధ్య నేరుగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నుండి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే.. అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య అయిన సుమలత బై-ఎలక్షన్ నిర్వహణకు సిద్ధం కావడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని సమాచారం.