నగరంలోని ఎల్బీనగర్ జోన్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య కలకలం రేపింది. స్థానిక పనామా చౌరస్తా సమీపంలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న సదరు వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు.