హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులను ప్రారంభించడానికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా, నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ విమానయాన సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు సంస్థ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని ముఖ్యమంత్రి కోరారు.