ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయింది. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. శస్త్రచికిత్స విజయవంతం అయిందని ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారని పేర్కొంది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టిందని తెలిపింది.