సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ఆమెకు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయించి, ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఏడేళ్లుగా ప్రేమించుకున్న యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో.. ఏకంగా వరుడి ఊరికి వెళ్లి, ప్రియుడు ఊరంతా తన ప్రేయసితో కలిసి దిగిన పోస్టర్లు గోడలపై అతికించాడు. కేవలం కట్నకానుకల కోసమే తన ప్రేయసిని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తున్నారని కూడా వాల్ పోస్టర్లలో పేర్కొన్నాడు.